Wednesday, October 19, 2011

తెలంగాణ తమ్ముడి కథ


అనగనగా ఒక ఊరు(భారతదేశం). ఆ ఊరిలో ఒక ఇంటి పెద్ద(ఆనాటి నిజాం, స్వాతంత్ర్య సమరయోదులు, స్తానిక నాయకులు) తన ఆస్తిని ఇద్దరు(తెలంగాణ, ఆంద్ర-రాయలసీమ) కొడుకులకు న్యాయ(ముల్కి నిభందనలు) బద్దంగా పంచుకోమని చెప్పి వెల్లిపోతాడు. అప్పుడు తెలివైన అన్న(ఆంద్ర-రాయలసీమ నాయకులు) తమ్ముడి (నిద్రావస్తలో ఉన్న తెలంగాణ నాయకులు) తో మన ఆస్తిలో ఆవు, చింతచెట్టు, దుప్పటి (హైదరాబాదు, సింగరేణి, గోదావరి, కృష్ణ జలాలు) ఉన్నాయి, వాటిలో ఆవు ముందుబాగం నీకు వెనుక బాగం నాకు, చెట్టు మొదలు నీకు చివర నాకు, దుప్పటి పగలు నీకు రాత్రి నాకు అని వివరిస్తాడు. ఈ పంపకం లో ఉన్న మోసం గ్రహించని తమ్ముడి (తెలంగాణ) అమాయకత్వంను ఆసరా గా తీసుకుని అన్న (ఆంద్ర-రాయలసీమ) తన ఆగడాలను సాగిస్తూ కొంతకాలం ఆనందంగా కాలం గడపసాగిండు.

ఇలాంటి సమయంలో తమ్ముడికి ఒక తెలివైన అమ్మయి(ప్రొ. జయశంకర్, కోదండరాం, కె.సి.ఆర్ ఇంకా మరికొందరు నాయకులు) భార్య గా దొరుకుతుంది. కొద్ది కాలంలోనే అన్న యొక్క మోసం ను గ్రహించిన ఆ అమ్మాయి. తన భర్త తో ఇలా చెప్తుంది.
- ఆవు ముందు బాగం నీది కనుక అన్న పాలు పితుకుతున్నపుడు నువ్వు కర్రతో ఆవును కొట్టు.
- చెట్టు మొదలు నీది కనుక గొడ్డలి తో నరుకు
-దుప్పటి పగలు నీది కనుక నీటిలొ ఉతుకు.
పై చర్యల ద్వార అన్పకు పాలు, చింత కాయ దూరం అయ్యయి. మరియు రాత్రినిద్ర కరువయింది. పైగా ఇన్ని బాదలకు ఏనాడొ అలవాటు పడిన తమ్ముడి కి ఏ బాదాలేక పోగా, కొత్త అవస్తలతో తిండి దొరక్క, ఆదాయం లేక రాత్రి చలి, దోమలతో నిద్ర కరువై అన్న సతమతంఅవుతున్నాడు తన మొరను మల్లి పెద్దల(ఇప్పుడు కేంద్రం) కు వివరిస్త్రున్నాడు.  

ఒక తెలంగాణ బిడ్డగా కేంద్రాన్ని కోరుతున్నది ఒక్కటే ఈ కథలో మోసం మీకు అర్థం అయితే మా తెలంగాణ మాకు ఇప్పించే ప్రయత్నం చేయండి.
ఇక ఆంద్ర-రాయలసీమ ప్రజలు కూడ ఈ కథలోని నిజాన్ని మనసాక్షి తో అంగీకరించండి.

9 comments:

  1. కేంద్రం వాళ్ళకి "కథలు"చెప్పకూడదు బై. నిజం జెప్పాలె! తమ్ముడికి దొరిజిన బార్యలు మొగుల్లని మోసం జేసే వ్యభిచారిణులు. సీక్రెట్టుగా "ఆడి"కార్లలో పొయి కాంగెస్స్,బిజెపి,జగను,మార్కిస్టులతో కలిసి కులుకుతున్నరు. ఎప్పుడూ ఎవరిని దేబిరించకూడదు బై! కష్టపడి సాధించుకోవాలె. ఎదుటోడి మీద ఏడవ కూడదు. మురిగిన చరిత్ర కథలు జెప్పకూడదు. అసలే కేంద్రం వాళ్ళకి తెలుగు రాదు. సమజైందా :)

    ReplyDelete
  2. hahha.. katha patade aina patralu marchesi bhale pettinav kada.. maino amma ki inipinchu tammi ichettadi migata telugollanta tatta butta sardukuni chattisgarh potaru. dunnukovachu baga.

    -krsna

    ReplyDelete
  3. edisi moham kadukkunatle undi..

    ReplyDelete
  4. అన్నయ్య కధ బాగానే చెప్పవు. కాని ఇప్పటి వరకు పంపకాలు జరగలేదు. నీవు చెప్పిన విధంగా పంచమని నీ KCR & Co. లు చెపుతున్నారు. నిజంగా పంచితే నీ కధ మాత్రం నిజమవుతుంది. మీకు నిజంగా తెలంగాణా మీద అక్కడి ప్రజల మీద అభిమానముంటే మాత్రం పంపకాల గోల ఆపండి. కలసి వుంటే కలదు సుఖం.

    ReplyDelete
  5. Great post but these guys will never admit it.

    ReplyDelete
  6. Why don't you stop feeding the cow, instead of beating with stick. No Grass No Milk. Got it.

    ReplyDelete
  7. ఈ కధను ఇంకోలాగూ చెప్ప వచ్చు తమ్ముడు. అనగనగా ఆ అన్నలు తమ ప్రాంతాలను ఎండగట్టి తమ్ముడి ప్రాంతాన్ని అభివృధి చేశారు. అప్పటికి అన్నలకి, తమ్ముడికి తెలివైన పెళ్ళాలు లేరు. ఇప్పుడు తమ్ముడు రెండో పెళ్ళి అతి తెలివి పెళ్ళాన్ని చేసుకున్నాడు. అప్పటి నుండి గొడవలు మొదలైయేప్పటికి అన్నలు రెండో పెళ్ళి చేసుకోలేదు కాని, వాళ్ళ కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇకనుండి తమ ప్రాంతాన్నే బాగుచేసుకొవలని అనుకున్నారు. కానీ తమ పెట్టుబడి అంతా తమ్ముడి ప్రాంతంలో చిక్కుకుని పోయింది. అది తెచ్చుకొటానికి తమ్ముడేమో అవకాశం ఇవ్వటం లేదు. ఈ చిక్కుముడి వీడాలంటే అన్నలు తమ్ముడు వాస్తవికి కోణం నుండి ఆలోచిస్తే తప్ప వీడదు. దోచుకున్నారు, దించుకున్నారు అనే వూకదంపుడు మాటలతో కాకుండా వాస్తవికంగా అలోచించి చూడు బంగారం. వెనుకపడ్డ ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వున్నాయి.

    ReplyDelete
  8. ఆవు, చింతచెట్టు, దుప్పటి ...
    కట్ చేసి సగం సగం తీసుకోవడమేగా..అన్నదమ్ములు విడిపోయి అస్తిపంపకాలు చేసుకోవడం అంటే...

    ReplyDelete
  9. నా పోస్టుకు స్పందించినందుకు సంతోషం


    నేను పంపకాలు అని అనలేదు. సరియైన రీతి లో వనరుల సద్వినియోగం జరగలేదు కనకనే పంపకాల విషయం తెరమీదకు వచ్చింది అంటున్నా. ఒకసారి ఆలోచించండి. నిబందనల ప్రకారం పరిపాలన జరిగి ఉంటే తెలంగాణ అంశం ఎందుకు ఇంత పెద్ద సమస్య అయ్యేది. ఇక పెట్టుబడి పెట్టాం అబివృద్ధి చేసాం అంటున్నారు కొందరు. మిమ్మల్ని మేము మీ పెట్టుబడులు తీసుకుని వెల్లిపొంమనడం లేదు కదా. మరి ఎందుకు మీకు తెలంగాణ అనగానే బయం పుట్టుకొస్తుంది.

    ReplyDelete